ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన సినీ నటుడు సుమన్

  • నేడు అమరావతి వచ్చిన సుమన్
  • ఏపీ మంత్రులతో మర్యాదపూర్వక సమావేశం
  • కూటమి విజయం పట్ల మంత్రులకు అభినందనలు
  • సుమన్ ను సన్మానించిన కొల్లు రవీంద్ర
టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ నేడు ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. ఇవాళ అమరావతి వచ్చిన సుమన్... మంత్రి లోకేశ్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి, నారా లోకేశ్ ఘనవిజయాలు అందుకోవడం పట్ల సుమన్ అభినందనలు తెలిపారు. 

అమరావతి వచ్చిన సందర్భంగా సుమన్ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కూడా కలిశారు. కల్తీ మద్యం కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని సుమన్ కోరారు. తన చాంబర్ కు వచ్చిన సుమన్ ను మంత్రి కొల్లు రవీంద్ర ఘనంగా సత్కరించారు. కాగా, సుమన్ చేతికి గాయం అయినట్టు తెలుస్తోంది. ఆయన బ్యాండేజ్ తో కనిపించారు.

Suman
Nara Lokesh
Amaravati
Kollu Ravindra
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News